*ఆ ప్రవక్త ఎవరు??*
💞ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన *మహిమ స్వరూపియగు తండ్రి* కి స్తోత్రములు🛐🛐 మరియు *ఆ ప్రవక్తను* అంగీకరించిన పరిశుద్ధులకు వందనములు🙏🏽🙏🏽
1) చాలాకాలంగా ఇస్లాం సోదరులు బైబిల్ని, క్రీస్తును గూర్చి ఎక్కువగా మాట్లాడుతూ వారి మూర్ఖత్వాన్ని బయట పెడుతున్నారు భారత దేశంలో ఉంటున్న మనం, అన్ని మతాలను అనగా... అందరి విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రేమను, శాంతిని నెలకొల్పవలసినది పోయి, హైందవ క్రైస్తవ విశ్వాసాలలో జోక్యం చేసుకుంటూ వారి విశ్వాసాలను వారి గ్రంథాలలో ఉన్న విషయాలను భిన్నంగా వ్యాఖ్యానిస్తూ రచనలు చేస్తూ *భారత రాజ్యాంగాన్ని అగౌరవ పరుస్తూ*,, ప్రశాంత భారతావనిలో మతకల్లోలాలకు కారణమవుతున్నారు..
కొందరు ఇస్లాం బోధకులు బైబిల్ పై కక్ష పెంచుకుని....
☪బైబిల్ దైవ గ్రంధం కాదని...
☪క్రీస్తు, సిలువ వేయబడలేదని...
☪బైబిల్ లో ఎన్నో శాస్త్రపరమైన తప్పులున్నాయని...
☪యేసు క్రీస్తు దేవుడు కాదని....
☪నిత్యజీవానికి బలి అవసరం లేదని......
☪బైబిల్ లో యేసు చెప్పిన ఆదరణ కర్త మహమ్మద్ అని.....
ఇలాంటి అసత్య బోధనలు చేస్తూ ఇప్పటికే క్రైస్తవుల మధ్య కరపత్రికల రూపంలోనూ విరివిగా వారి బోధలు విడిచిపెట్టి ఉన్నారు. బైబిల్ పై, క్రైస్తవుల పై ఉన్న ద్వేషాన్ని కనపరుస్తున్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ఎవరి విశ్వాసం గూర్చి వారు నిరభ్యంతరంగా ప్రకటించుకోవచ్చు. కాని *ఎవరూ ఇతర విశ్వాసాల (మతాల) జోలికి వెళ్ళకూడదు* ఇది భారత రాజ్యాంగం మనకిచ్చిన చక్కని అవకాశం. బైబిల్ లో కూడా క్రీస్తు శకం 65 లో పేతురు గారు రాస్తూ....(1పేతురు 4:15)
మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల (విశ్వాసాల) జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.
2) కొందరు ముస్లిం మిషనరీలు పల్లె ప్రాంతాల్లో చిన్న చిన్న క్రైస్తవ బోదకుల వద్దకు వెళ్లి, క్రైస్తవులతో....
👉🏿మీరు చాలా తప్పు చేస్తున్నారు, పొరబడ్డారు,
☪బైబిల్లో మోషే చెప్పిన మాటలు కానీ...
☪ఆదరణ కర్త మీ వద్దకు వస్తాడు అని చెప్పిన మాట కాని..
☪యేసు సిలువపై మరణించడం కానీ..
ఇవన్నీ బైబిల్ నందు ప్రస్తావించబడలేదు, బైబిల్ చెప్పలేదు, అంటూ బైబిల్ లో లేని మాటలు ఎవరో చెప్పి మిమ్మల్ని మోసం చేయుచున్నారని, ఎన్నో ముస్లిం మిషనరీలు క్రైస్తవులైన వారిని కలవరపెడుతున్నాయి. బైబిల్ ని చదివేవారు గాని మరియు ముస్లిం సోదరులు గానీ బైబిల్ చదివే విషయంలో పొరబడుతున్నారు. ఇప్పుడే కాదు క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో పుట్టిన మహమ్మద్ అనుచరులైన ముస్లిం సోదరులు మాత్రమే కాకుండా, మొదటి శతాబ్దంలో కొద్ది కాలానికే వాక్యానికి కలిపి చేరిపేవారు వచ్చేశారు. (2కోరింథీ 2:17)
కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము.
3) ఇంతకు బైబిల్లో మోషే చెప్పిన *ఆ ప్రవక్త ఎవరు* అనే విషయం మనకు తెలియాలంటే ముందుగా *ప్రవక్త* అని ఎవరిని అంటారో తెలియాలి.
*ప్రవక్త*🛐
ప్రభువు పంపగా వచ్చిన వాడు, ప్రభువు పక్షముగా ప్రజలతో మాట్లాడేవాడు, దేవునికి ప్రజలకు ప్రవక్తగా మధ్యవర్తిగా కూడా భావించవచ్చు. ప్రవక్తలందరూ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేమనగా.... అని ప్రారంభించడం మనం చూస్తుంటాము.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.... (యషయా 50:1)
(యషయా 66:1)
(యిర్మీయా 1: 4)
*ప్రభువు చెప్పిన మాటలను ప్రజలకు ప్రకటించువాడే ప్రవక్త.* కానీ అబద్ధ ప్రవక్తలు లేకపోలేదు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అని (2 పేతురు 2:1). నిజ ప్రవక్త ఎవరు అబద్ధ ప్రవక్త ఎవరు గుర్తించాలంటే క్రైస్తవుడిగా నీకు లేఖానాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి..ఈ మధ్య కాలంలో కొందరు తమ పేర్లకు ముందు ప్రవక్త అని మరికొందరు అపొస్తలుడైన అని తగిలించుకోవడం మనం చూస్తున్నాము కానీ....
*ప్రవక్తలనబడినవారు ఎప్పటి వరకు ఉన్నారు?*
🔥లూకా 16:16
*యోహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి*.
మొదటి శతాబ్దం వరకే ప్రవక్తలున్నారన్న విషయం అర్థమైతే తర్వాత వచ్చిన వారు ఎవరూ ప్రవక్తలు కారనే సంగతి సులువుగా గ్రహించవచ్చు. (ద్వితి 18:16) నీ దేవుడైన యెహోవా నీ మధ్యను *నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను*..పై మాటను ఇస్లాం సోదరులు ఎలా వక్రీకరించారoటే, మోషే ఇశ్రాయేలీయులతో నీ సహోదరులలో నుండి అన్నాడు కనుక ఇశ్రాయేలీయుల సహోదరులు ఇష్మాయేలు చెప్పిన ఆ ప్రవక్త నుండి రావాలి, ఆ ప్రవక్త మాటే అందరూ వినాలి, ఆయనే ముహమ్మద్ ప్రవక్త అని వక్రీకరిస్తూ.... పేతురు గారు రాసిన మాటలను నిజం చేశారు. (2పేతురు 3:16)
వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో *కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు (వక్రముగా త్రిప్పుదురు)*.
4) ప్రియులారా.....
ఈ సందర్భంలో మోషే మాట్లాడుతున్నది *ఇశ్రాయేలీయులను ఉద్దేశించే కానీ ఇస్మాయేలీయుల కొరకు కాదు*. కారణం ఇశ్రాయేలీయులు అనగానే ఒక్కరు కాదు 12 గోత్రాలు ప్రజలు. ఒక గోత్రం వారు మరొక గోత్రం వారికి సహోదరులు అవుతారు. ఈ కనీస జ్ఞానం ఇస్లాం సోదరులకు లేకపోవడం విచారకరం. ఒకవేళ వారి (నీ) సహోదరులు అనగానే అదే అనుకుంటే ప్రతి సందర్భంలో అలానే ఆలోచించాలి👇🏿
💞దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి కానానుకి చేరిన తర్వాత వారు నిర్వర్తించవలసిన ధర్మములను మోషే ద్వారా తెలియజేస్తూ..... (ద్వితి 17:15)
*నీ సహోదరులలోనే ఒకని* నీమీద రాజుగా నియమించుకొనవలెను. *నీ సహోదరుడు కాని అన్యుని* నీమీద నియమించుకొనకూడదు. పై మాటలో నీ సహోదరులు అనగానే ఇస్మాయేలీయులు అయితే ఇశ్రాయేలీయులపై రాజు ఎవరు ఉండాలి??
ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులలో ఒక్కరినైనా ఇస్మాయేలీయుడను చూపించగలరా?? పరిపాలించిన రాజులు అందరూ ఇశ్రాయేలీయులు. వీరందరూ ఇశ్రాయేలీయులు.
💞మరొక Ex:-
మోషే మరణాంతరం మోషే నాయకత్వ బాధ్యతలు చేపట్టిన యెహోషువ యొర్దాను ఇవతల ఇశ్రాయేలు 12 గోత్రాలలో రూబేను గాదు మరియు మనస్సే అర్ధగోత్రపు వారితో మీరు నది దాటి మీ దేవుడైన యెహోవా వారి దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును మీ సహోదరులకు సహాయం చేయవలెను అన్నాడు. అంటే రెండున్నర గోత్రాల వారు సహాయం చేయవలసింది ఇస్మాయేలీయులకా? ఇశ్రాయేలీయులకా?? కనీస పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరైనా సులువుగా అర్థం చేసుకోగలరు. ఇశ్రాయేలీయులకె కానీ ఇస్మాయేలీయులకు కాదు.
5) ☝🏿పై రెండు ఉదాహరణలలో మీ (నీ) సహోదరులు అనగానే ఇశ్రాయేలీయులు అనుకున్నప్పుడు (ద్వితి 18:16) సందర్భంలో ఎందుకు అనుకుంటున్నారు??
ఆ ప్రవక్త మహమ్మద్ అని నమ్మించుటకు వీరు పడుతున్న ప్రయాసకు చూసి జాలి పడుతున్నాము. బైబిల్ లో లేని వాటిని చెప్పి ప్రపంచంలో ఎవరినైనా నమ్మించగలరేమో గాని, క్రీస్తు సంఘము వారిని నమ్మించుట మీ తరం కాదు.
పై సందర్భాలన్నింటినీ బట్టి *ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండి మాత్రమే రావాలి*.
మరో ముఖ్యమైన విషయమేమంటే ప్రియులారా... దేవుడు తన మాటలను తెలియజేయుటకు ప్రారంభం నుండి అనగా మోషే కాలం నుండి ఇశ్రాయేలీయుల (యూదులు) ను మాత్రమే ఎంపిక చేసుకున్నట్లుగా మనము బైబిల్ నందు చూడగలము.
👉🏿ఎక్కడైనా దేవుడు, ఇష్మాయేలు ద్వారా నా మాటలను తెలియజేయుదును అని అన్నట్లుగా మీరు చూపించగలరా??
(రోమా 3:2)
దేవోక్తులు యూదుల పరము చేయబడెను.
(యోవేలు 2: 28)
(ఆమోసు 2: 11)
(కీర్తనలు 147:19)
ప్రవక్తలందరూ... ఇశ్రాయేలీయుల నుండి వచ్చారు, వస్తారు అనే విషయం మనకు అర్థం అవుతుంది కనుక ఈ మాటలు అన్నింటిని బట్టి మహమ్మద్ గారు ఆ ప్రవక్త అయ్యే అవకాశమే లేదు.
6) ప్రియులారా....
ఆ ప్రవక్త ఇశ్రాయేలీయులలోనుండి మాత్రమే రావాలి అటువంటప్పుడు ఎందరో ప్రవక్తలు ఇశ్రాయేలీయులలో ఉన్నారు.
👉🏿మరి ఎవరు
*ఆ ప్రవక్త*??
యేసు క్రీస్తు రాక విషయమై ఎన్నో ప్రవచన లేఖనములు ధర్మ శాస్త్రంలోనూ, కీర్తనల గ్రంథములలోను, ప్రవక్తల గ్రంథములలోను మనము చూడగలము.
(యోహాను 1:45)
ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో *మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు* అని అతనితో చెప్పెను.
(లూకా 24: 44)
అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను *నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను*. యేసు క్రీస్తే స్వయంగా *నన్నుగూర్చి మోషే ధర్మశాస్త్రంలోను వ్రాయబడినది* అని చెప్తున్నాడు... అంటే ఒకవేళ మోషే ద్వితీయోపదేశకాండము లో చెప్పిన *ఆ ప్రవక్త యేసు క్రీస్తు వారు* అయుండొచ్చు కదా!! చూద్దాం.
7) *యేసు ప్రవక్తా??*
(హెబ్రీ 1:1)
దేవుడు చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తెలియ జేయువాడే ప్రవక్త అని ముందుమాటలో మీరు చదువుకున్నారు ఇప్పుడు యేసును కూడా ప్రవక్తగా మనం చెప్పడంలో తప్పులేదు.
యోహాను 12:49,50
యోహాను 17:7
యోహాను 8:26
యోహాను 7:16
లూకా 4:19
యోహాను 9:17
(లుకా 24:19)
ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల *ప్రవక్తయై* యుండెను.
మత్తయి 21:11
మత్తయి 21:46
లూకా 7:15,16
8) వ్రాయబడిన వాటన్నిటినీ బట్టి ఏసుక్రీస్తు ప్రవక్త అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఏసుక్రీస్తు ప్రవక్త అని చెప్పినంత మాత్రాన ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు,
అని నేను చెప్పటం లేదు.
👉🏿ఒక ఆఫీసర్, ఆఫీసులో ఉన్నప్పుడు ఆఫీసర్ గా పిలవబడతాడు, ఇంట్లో ఉన్నప్పుడు భార్యకు భర్త గా, పిల్లలకు తండ్రిగా తల్లిదండ్రులకు కుమారుడుగా, అన్నకు తమ్ముడుగా పిలవబడతాడు. ఒక వ్యక్తి అన్ని విధములుగా పిలువబడుచున్నాడు. ఇది సరి అయినదే.
🔥అలానే ఏసుక్రీస్తు.....
ప్రవక్తగా.....
దేవునిగా......
దేవుని
కుమారుడిగా.....
ఆయనకున్న లక్షణాలను బట్టి మనకు అర్థం అవుతున్నది.
ప్రియులారా.....
ఏసుక్రీస్తు ప్రవక్త అనే విషయము మనకు అర్థం అయింది కానీ,,,,,
9) *ఆ ప్రవక్త యేసు క్రీస్తేనా?*
ఏసుక్రీస్తు సమకాలికుడు బాప్తిస్మమిచ్చు యోహాను. ఈయన కూడా ప్రవక్తనే. ఒకవేళ ఇతనే ఆ ప్రవక్త అయి ఉండవచ్చమో?? ఏసుకు ముందుగా వచ్చాడు కదా! ఇదే సందేహం ఒకనాడు యూదులకు సైతం రావడం జరిగింది. దానిని నివృత్తి చేసుకోవడం కొరకు యోహాను యొద్దకు ఎరుషలేము నుండి యాజకులను లేవీయులను పంపారు. వారు వెళ్లి నీవు క్రీస్తువా? అని అడిగినప్పుడు కాను అని చెప్పడం, అందుకు వారు, మరి ఏలియావా? అని అన్నప్పుడు అందుకు, యాజకులు లేవీయులు, నీవు క్రీస్తువి ఏలియావు కానప్పుడు, మరి *నీవు ఆ ప్రవక్తవా*, అనగా...... మోషే ఒకనాడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించుదును అని అన్నాడే *ఆ ప్రవక్తవా??* అని అడిగినందుకు యోహానే స్వయంగా.. నేను కాదు అని చెప్పుటను బట్టి ఆ ప్రవక్త యోహానుగారు కారు అనే విషయం అర్థమైంది. (యోహాను 1: 19-22)
యేసు క్రీస్తే ఆ ప్రవక్త అని అనుటకు లేఖన ఆధారములలో కొన్నిటిని మనము ఆలోచన
చేయగలిగితే..ఆ ప్రవక్త ఇశ్రాయేలీయుల గోత్రములలో ఏదో ఒక గోత్రము నుండి రావాలి. *ఏసుక్రీస్తు ఇశ్రాయేలీయడా??* అవును. ముమ్మాటికి ఆయన ఇశ్రాయేలీయుడే. అనగా ఆ మహనీయుడు యూదా గోత్రములో నుండి వచ్చాడు.
(రోమా 9:4)
(మత్తయి 1:1)
(మత్తయి 2:2)
(రోమా1:7)
(2తిమోతి 2:8)
పైన రాయబడిన కొన్ని లేకనాధారములను బట్టి... ఏసుక్రీస్తు దావీదు సంతానమనగా.... యూదా వంశం నుండి వచ్చాడు అనే విషయం
విషదమవుచున్నది. ప్రియులారా ఏసుక్రీస్తు ఒకనాడు గలలియా సముద్రపు అద్దరిన కొండ ఎక్కి తన శిష్యులతో కూర్చోవడం, మరియు ఏసును వెంబడించిన బహుజన సమూహం విషయమై యేసు ఆలోచన చేసి భుజించుటకు, వీరికి ఆహారం ఎలా అని తన వెంబడి ఉన్న శిష్యులను అడిగినప్పుడు ఆంద్రేయ ఒక చిన్న వాని వద్ద 5 యవల రొట్టెలు 2చిన్న చేపలు ఉన్నవి అనగా.... యేసు వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించగా ఇంచుమించు 5 వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు కాక అందరూ తృప్తిగా తినిన తరువాత 12 గంపలు మిగలడం కనులారా చూచిన జన సమూహం, ద్వితీయోపదేశకాండం లో మోషే చెప్పిన *లోకమునకు రాబోవు ప్రవక్త అని చెప్పు కొనిరి.*
(యోహాను 6:14)
(యోహాను 7:40).
10) ఒకనాడు యేసు చేసిన సూచకక్రియలను ఆయన మాటలను స్వయంగా విన్న ప్రజలు మోషే ద్వారా చెప్పబడిన.... లోకమునకు రాబోవు ప్రవక్త యేసు అని సాక్ష్యం ఇచ్చినప్పుడు....
ఈరోజు మన సహోదరులు కాదు అనడం ఎంతవరకు సబబో వారే పునర్విమర్శచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా చదివిన తరువాత ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక, వారు ఇది ప్రజలు ఇచ్చిన సాక్షం కనుక చెల్లదు అనవచ్చు. ఎందుకనగా క్రీస్తుపైన వారికి సరైన అభిప్రాయం లేదు. కారణం మనసంతా మహమ్మద్ తో నిండి ఉంది. *యేసే ఆ ప్రవక్త* అని ఎవరు చెబితే నమ్ముతారు వీరు?? ఒకనాడు యేసు పిలిచిన వెంటనే తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి కడవరకు ఏసును వెంబడించి, యేసు మరణం తర్వాత కూడా తమ ఆరోగ్యాన్ని అవయవాలను కడకు తమ ప్రాణాలను సైతం అర్పించిన అపోస్తలులు చెబితేనైనా వీరు నమ్మాలి.
అపోస్తులులలో ఒకడైన పేతురు ఇశ్రాయేలీయులతో చెపుతున్న మాటలను వాక్యములో చూడగలిగితే.....
(అపో.కా.3:22,23)
అపో.కార్యములు 3: 22
మోషే యిట్లనెను...ప్రభువైన దేవుడు *నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును;* ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.(లేక, విందురు).
*ఆ ప్రవక్త మాట* విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
🔥పై మాటలను పేతురు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో బైబిల్ పై కనీస జ్ఞానం ఉన్న ఎవరైనా సులువుగా గ్రహించగలరు.
మోషే ప్రవచనం యేసును గూర్చినది అని, ఎవరైనా ప్రపంచంలో వినవలసినది ఆయన మాట మాత్రమేనని, లేదంటే నాశనం తప్పదన్న విషయాన్ని గ్రహించి ఏసు వద్దకు వస్తే రక్షణను పొందుకుంటారు, లేదంటే శిక్ష. (అపో 4:12)
మరి *ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే* మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన *మరి ఏ నామమున రక్షణ పొందలేము* అనెను.
యోహాను 8:51
మత్తయి 7:24
11) ఇస్లాం సోదరులు యేసుని నమ్ముతాము, ఆయన అంటే మాకు గౌరవం అంటున్నప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట నమ్మాలి, ఆయన చెప్పిన ప్రతిదీ చేయాలి, వారికి అనుకూలంగా ఉన్న వాటిని నమ్మి మిగిలినది వదిలేయడం, *మహానుభావుడైన యేసును అగౌరవపరచడమే అవుతుంది*.
(యోహాను 14:6)
యేసే స్వయంగా నేను చెప్పినది సత్యము అంటున్నాడు అంటే... నా తరువాత ఎవరూ వచ్చి
చెప్పినా సత్యం కాదనే కదా!
మోషే గారు నా వంటి ఒక ప్రవక్తను అన్నారు కదా! మోషే లాంటి ప్రవక్త అనగానే.... వయస్సు, వివాహం, పిల్లలు కాదు, ఆలోచించాల్సింది, లక్షణాలు కావాలి. దేవుడు అనగానే ఎలా లక్షణాలను పరిగణలోకి తీసుకుంటామో, అలానే మోషే లాంటి క్యారెక్టర్ కలిగినవాడు అని అర్థం.
🔥మోషేను గూర్చి దేవుడే పలికిన మాటలను మనము చూడగలిగితే.....
(సంఖ్య 12:3)
(సంఖ్య 12:7)
స్వయంగా దేవుడే మోషే లో నున్న గుణ లక్షణాలు గూర్చి మాట్లాడుతూ.....👇🏿
ఓర్పు
సహనం
సాత్వికత నమ్మకమైనవాడు
అని అంటున్నాడు.
👉🏿ఇవే లక్షణాలు తిరిగి మనం స్పష్టంగా యేసుక్రీస్తులో... చూడగలము.
12) ఏసు స్వామి తన జీవిత కాలంలో...
అవమానాలు
నిందలు
బాధలు
కష్టాలు
శ్రమలు...
ఎన్నో చూడగలము. ఇవన్నీ భరించాడంటే.... ఆయనలో ఉన్న...
ఓర్పు
సహనం
సాత్వికత
ఎంతో మనం అర్థం చేసుకోగలము.
అయితే క్రీస్తు కుమారుడై ఉండి, ఆయన ఇంటిమీద నమ్మకంగా ఉన్నాడు. *మోషే లాంటి వాడు ఏసుక్రీస్తు* కానీ మహమ్మద్ కాడు.
🔥ప్రియులారా......
1. ఆ ప్రవక్త ఇశ్రాయేలీయులలో నుండే రావాలి✅
2. ప్రవక్తలందరూ ఇశ్రాయేలీయులే✅
3. సహోదరులు అనగానే ఇశ్రాయేలు 12 గోత్రాలు వారే✅
4. ప్రజలు, అపోస్తలులు, పౌలు గారు ఇచ్చిన, రాసిన సాక్ష్యాన్ని బట్టి, *యేసే ఆ ప్రవక్త*✅
5. ఏసు తరువాత సుమారు 600 సం౹౹లకు వచ్చిన మహమ్మద్ *ఆ ప్రవక్త* అనుకోవడం ఇస్లాం సోదరుల భ్రమ✅
6. మహమ్మద్ ఇశ్రాయేలీయుడే కానప్పుడు, ప్రవక్త కాదు. *ఆ ప్రవక్త అసలు కాదు*.✅
13) అయితే ఆయన, అనగా *సత్యస్వరూపియైన ఆత్మ* వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును;. (యోహాను 16:13)
☝🏿పైన చెప్పబడిన వచనము *ఒక వ్యక్తికి* ఎలా సరిపోతాయి మీరే ఆలోచించండి?? *ఆయన వ్యక్తి కాదు శక్తి* (ఆత్మ).. లోకము ఆయనను చూడదు మొహమ్మద్ గారిని లోకం చూడలేదా?? *మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు* అన్నాడు మరి *మహమ్మద్ ఇప్పుడు ఉన్నారా*? ఏమాత్రం ఆలోచించినా మనకు మహమ్మద్ కనిపించరు. ఈ మాటను మహమ్మద్ గారికి ఆపాదించడం హాస్యాస్పదం. పరిశుద్ధాత్ముడు అనగానే వ్యక్తి అని అనుకోవడం వారు చేసిన అతి పెద్ద పొరపాటు. వీరు చేసిన తప్పు ఎంత భయంకరమైన వీరికి అర్థం అవ్వట్లేదు. (మత్తయి 12: 32)
మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని *పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.* సామెతలు 14: 12
ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.
(ప్రకటన 22:18,19)
కలప వద్దు, తీయ వద్దు అంటున్నాడు దేవుడు. అంటే పరిపూర్ణo అయిపోయిందని అర్థం. పరిశుద్ధ గ్రంధం చివరి పేజీలో *సమాప్తమైనది* అని ఉంటుంది. అంటే తరువాయి భాగం రేపు అని గానీ, తరువాయి భాగం మరో గ్రంధంలో అని కానీ కాదు. ఈ *సమాప్తము అన్న పదాన్ని కళ్ళు పెద్దవిగా చేసుకొని చూడమని మనవి*. సమాప్తం అని ముద్ర వేసి ముగించాడు దేవుడు.. బైబిల్ సంపూర్ణ సత్య గ్రంథంగా సర్వమానవాళికి అందుబాటులో ఉంది. బైబిల్ లో లేనిది బైబిల్ కి భిన్నమైనది ప్రపంచ గ్రంధాలలో ఉన్నా, ఎవరు చెప్పినా నమ్మకూడదు. క్రీస్తుశకం 58 లో గలతి పట్టణంలో ఉన్న క్రైస్తవులకు రాసిన పత్రిక హెచ్చరికతో కూడిన మాటలు మనం చూడగలిగితే...(గలతియులకు 1: 8)
మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను *మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక*.
🔥🔥🔥🔥🔥
